
డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ధనుష్ 51వ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున (Nagarjuna) విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు.
"DNS' అనే వర్కింగ్ టైటిల్ తో షూట్ స్టార్ట్ చేసిన ఈ మూవీకి తాజాగా కుబేర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే కుబేర పోస్టర్ లో హీరో ధనుష్ గుబురు గడ్డం..మాసిన బట్టలు ..శివ పార్వతులు ముందు నిల్చున్నారు. ఈ మోషన్ పోస్టర్ లో చాలా ఆసక్తిగా ఉండటంతో పాటు..సినిమాపై అంచనాలు కూడా పెంచేస్తోంది.
On this auspicious Maha Shivratri,
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 8, 2024
we unveil the First Look and Title Motion Poster of #Kubera ❤️?❤️?
Witness this man stirring up the proceedings in theaters soon! ??
▶️ https://t.co/5HNmb0slKX#KuberaFirstLook@dhanushkraja King @iamnagarjuna @iamRashmika @sekharkammula pic.twitter.com/aw40udSE4I
ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్లో.. శేఖర్ కమ్ముల స్టోరీ కాన్సెప్ట్ ను రివీల్ చేశాడు. 'అసమానతను సూచిస్తూ, నగరాన్ని విభజించే కరెన్సీ నోట్లు..ఎంతో ఖరీదైన భారీ బిల్డింగులు..మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడలు..ఈ రెండింటి మధ్యలో పాత వంద రూపాయల నోట్ల కట్టని' చూపించి ఫ్యాన్స్ కు వీపరీతంగా నచ్చేలా చేశాడు.
శేఖర్ కమ్ముల మరోసారి సమాజాన్ని ప్రశ్నించేలా..సోసైటీలో అసమానతల్ని ఎత్తి చూపుతూ తనదైన మార్క్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ధనుష్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.
ALSO READ :- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే
'DNS'..ధనుష్..నాగార్జున..శేఖర్ కమ్ముల..ఈ ముగ్గురి కలయికలో వస్తోన్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు
Happy Birthday @dhanushkraja ...#d51 #dhanush #amigoscreations #svcllp pic.twitter.com/FQF8o5ZaMY
— Sekhar Kammula (@sekharkammula) July 27, 2023