కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishq Mein). తెలుగులో ‘అమర కావ్యం’గా నవంబర్ 28న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా దుమ్మురేపే వసూళ్లు సాధిస్తోంది. ఇండియా వైడ్గా.. కేవలం ఐదు రోజుల్లోనే రూ.71 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.
‘తేరే ఇష్క్ మే’మూవీ.. ఫస్ట్ డే శుక్రవారం రూ.18 కోట్లతో డీసెంట్ ఓపెనింగ్ అందుకుని.. శనివారం రూ.17 కోట్లు, ఆదివారం రూ.19 కోట్లు వసూలు చేసింది. సోమవారం కాస్తా తగ్గి రూ.8.75 కోట్లు, ఆ తర్వాత మంగళవారం ఊపందుకునే రూ.10.25కోట్ల నెట్ రాబట్టింది. అయితే, తెలుగు, తమిళ కలెక్షన్స్ తగ్గినప్పటికీ హిందీ వెర్షన్ మాత్రం.. వసూళ్ళ జోరు కొనసాగిస్తోంది.
ధనుష్ నటించిన రీసెంట్ ఫిల్మ్స్తో పోలిస్తే, బాక్సాఫీస్ వద్ద తేరే ఇష్క్ మే మంచి పెర్ఫార్మ్ చేస్తోంది. ధనుష్ నుంచి లాస్ట్ రిలీజైన సినిమాలు చూసుకుంటే..‘ఇడ్లీ కడై’ మూవీ ఏడవ రోజు నాటికి ఇండియాలో సుమారు రూ. 45 కోట్లు చేయగా.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ ఏడు రోజుల్లో రూ. 69 కోట్లు దాటింది. ఇపుడు, ‘తేరే ఇష్క్ మే’ కేవలం ఐదు రోజుల్లోనే రూ.71 కోట్ల నెట్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ‘తేరే ఇష్క్ మే’.. 2025లో ధనుష్కి బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే.. ఈ సినిమాకి పోటీగా వచ్చిన రామ్ 'ఆంధ్రాకింగ్ తాలూకా' మాత్రం ఆరు రోజుల్లో.. కేవలం రూ. 17 కోట్ల ఇండియా నెట్ చేసింది.
ALSO READ : బిగ్ బాస్ 13వ వారం ఓటింగ్ వార్..
ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, డైరెక్టర్గా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. మధ్యలో సినిమాలు సైతం నిర్మిస్తున్నారు. గతేడాది రాయన్, ఈ ఏడాది కుబేరా, ఇడ్లీ కడై సినిమాలతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్ కలాం బయోపిక్తో పాటుగా మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.
