ధనుష్ ‘తిరు’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

ధనుష్ ‘తిరు’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

తమిళ హీరో ధనుష్ న్యూ ఫిల్మ్ ‘తిరు’  తెలుగు ట్రైలర్ విడుదలైంది. ‘‘రేయ్ పండు నీ ఆర్డర్ రెడీ అయ్యింది.. ఎంత సేపటి నుంచి పిలవాలి.. వచ్చి తీసుకెళ్లు’’ అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ధనుష్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ‘‘ నా పేరు తిరు ఏకాంబరం .. వచ్చాడు ఘర్షణ ఏకాంబరం’’ అంటూ ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి ధనుష్ చెప్పే పంచులు అలరిస్తున్నాయి. నా ఫ్రెండ్ శోభన (నిత్యా మీనన్) అంటూ పరిచయం చేయడంతో ఈ సినిమాలో వీరు స్నేహితులని అర్థమౌతోంది. వీరి మధ్య సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ మధ్యలో రాశి ఖన్నా (అనూష)  ఎంట్రీ ఇచ్చింది. ఈమెను ధనుష్ ప్రేమిస్తుంటాడు. అతడికి నిత్యామేనన్ సహకరిస్తుంటుంది. అనంతరం విలన్లతో ఫైటింగ్ చేస్తుంటాడు. 

ఎలా ఉంది ఫైట్ అంటూ ధనుష్ అడగగా.. నమ్మలేకపోతున్నానంటూ నిత్యామీనన్ సమాధానం ఇవ్వడం.. మనల్నే మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం.. మనం మంచి లెవల్ లో ఉన్నామని ధనుష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. బాధతో ఇళయరాజా పాటలు వింటూ కూర్చుంటాడు అని నిత్యా మీనన్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. మిత్ర ఆర్. జవహర్ దర్శకత్వంలో ‘తిరు చిత్రాంబళం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో ‘తిరుగా’ విడుదల చేయనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ ను చూస్తే ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించారని అర్థమౌతోంది. ఆగస్టు 18వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో  ఈ మూవీ విడుదల కానుంది.