V6 News

త‌‌ను నాటింది.. త‌‌నే న‌‌రుక్కోవాలి: ఇంట్రెస్టింగ్‎గా ధనుష్ కర టీజర్

త‌‌ను నాటింది.. త‌‌నే న‌‌రుక్కోవాలి: ఇంట్రెస్టింగ్‎గా ధనుష్ కర టీజర్

కోలీవుడ్ స్టార్ ధనుష్  నటించిన  లేటెస్ట్ మూవీ ‘కర’.  విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌పై ఇషారీ కె గణేష్ నిర్మించారు. ఇప్పటికే తమిళ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేయగా, శుక్రవారం  తెలుగు టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టీజర్ ద్వారా రివీల్ చేశారు. ‘పంటో.. గ‌‌డ్డో..  పాప‌‌మో..పుణ్యమో.. త‌‌ను నాటింది..త‌‌నే న‌‌రుక్కోవాలి.. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకొచ్చింది. 

అంతకంటే ముందు నామీద ప‌‌డ్డ మ‌‌చ్చని తుడిచేయాలి. న‌‌న్ను న‌‌మ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి. నా పేరు క‌‌ర‌‌స్వామి.. నన్ను కర అని పిలుస్తారు’ అంటూ ధనుష్​ పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది. ధ‌‌నుష్​ పాత్రలో చాలా వేరియేష‌‌న్స్ క‌‌నిపిస్తున్నాయి. ఓ వైపు స‌‌మ‌‌స్యను ఎదుర్కొనే యువ‌‌కుడిగా, మ‌‌రో వైపు భావోద్వేగాలు క‌‌ల‌‌గ‌‌లిసిన వ్యక్తిగా ఓ ప‌‌రిణితిగ‌‌ల పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.  

తను హీరోగా నటించిన  54వ చిత్రం కాగా,  మమితా బైజు హీరోయిన్‌‌గా నటించింది.  జయరామ్, కేఎస్ రవికుమార్ ఇతర  ముఖ్య పాత్రలు పోషించారు.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ స్పెషల్‌‌గా  ఏప్రిల్ 30 న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల  కానుంది. తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్లపై  సీహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు.