దేశంలోనే ధరణి పెద్ద స్కాం..దర్యాప్తు జరిపించండి : కాంగ్రెస్

దేశంలోనే ధరణి పెద్ద స్కాం..దర్యాప్తు జరిపించండి : కాంగ్రెస్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్.. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం.. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ల్యాండ్ రిసోర్సెస్ సెక్రటరీ అజయ్ టిర్కిని కలిసి ఫిర్యాదు చేసింది. సవరణల పేరుతో తెలంగాణ భూరికార్డుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది. తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయయని కోదండ రెడ్డి ఆరోపించారు. పట్టా భూములు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పంచిన భూములను నిషేధిత జాబితాలో చేర్చి 24 లక్షల కుటుంబాల భూములకు పట్టా చేయలేదని చెప్పారు. పేదల భూములను టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కబ్జాలు చేశారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ రికార్డును విదేశీ కంపెనీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిషేధిత భూమిగా ఉన్న 600 ఎకరాలను మైహోం రామేశ్వరరావుకి ఎలా కట్టబెడతారని నిలదీశారు. ఎకరానికి రూ.3 కోట్లు విలువ చేసే భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున కేటాయించారని ఆరోపించారు. వేల కోట్ల కోకాపేట భూములను ఎలా వేలం వేస్తారని ఫైర్ అయ్యారు.

పేదల భూములను దోచుకున్నరు: దామోదర్ రెడ్డి

ఒక్క గుంట జాగా పోనివ్వబోమని ధరణి పోర్టల్ తెచ్చిన కేసీఆర్.. నిజాం నుంచి వచ్చిన భూములను కూడా కబ్జాలు చేశారని రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. పేదల భూములను టీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. తమ ఫిర్యాదులపై సెక్రటరీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే భూరికార్డుల సవరణలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సెక్రటరీని కలిసిన వారిలో పీసీసీ నేతలు కురువ విజయ్ కుమార్, వేనా రెడ్డి తదితరులు ఉన్నారు.