
- ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకోండి
- ఈసీకి విశారదన్ మహారాజ్ విజ్ఞప్తి
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరగకుండా నియంత్రించాలని ఈసీని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ కోరారు. పేద ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. గురువారం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు.
అనంతరం విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. ఎన్నికలు అయిపోయేదాకా రాష్ట్రంలో ఎక్కడా మద్యం సేల్స్ చేయకూడదన్నారు. మద్యం అమ్మినా, తాగినా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకులు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారని.. ప్రతి ఇంటికి బహుమతులు, ఇతర వస్తువులను పంపిణీ చేయకుండా అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 50 ఇండ్లకు ఒక సెంట్రల్ పోలీస్ చొప్పున పర్యవేక్షించాలని తెలిపారు.