ధర్మం, రాజ్యాంగం.. రెండూ అవసరమే..అయోధ్యలో రాజ్యాంగ ప్రతి సమర్పించి పూజలు

ధర్మం, రాజ్యాంగం.. రెండూ అవసరమే..అయోధ్యలో రాజ్యాంగ ప్రతి సమర్పించి పూజలు
  • చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: మన దేశ భవితవ్యానికి ధర్మం, రాజ్యాంగం రెండూ అవసరమేనని చిల్కూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు సీఎస్​ రంగరాజన్​ అన్నారు. అయోధ్యలోని రామలల్లా సన్నిధిలో ఆయన భారత రాజ్యాంగ ప్రతిని అర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను చేసింది కేవలం వ్యక్తిగత భక్తిని ప్రదర్శించే చర్య కాదని, భారతదేశంగా మనం ధర్మం, ప్రజాస్వామ్యాన్ని ఏకకాలంలో గౌరవించగలమనే సందేశాన్ని బలంగా తెలియజేసే ఉద్దేశ్యమన్నారు. 

1947 జనవరి 22న రాజ్యాంగ సభ ఉద్దేశ్య తీర్మానాన్ని ఆమోదించబోయే సమయంలోనూ శ్రీరామ, సీత, లక్ష్మణ, హనుమంతుల చిత్రాల సన్నిధిలో తీర్మానం చదివారన్నారు. రామరాజ్యం, భారత గణరాజ్యం రెండూ సమాన నైతిక మూలాలపై ఆధారపడి ఉంటాయన్నారు.