కేసీఆర్ రైతుల రక్తం తాగే బ్రోకర్

కేసీఆర్ రైతుల రక్తం తాగే బ్రోకర్

సీఎం కేసీఆర్  రైతుల రక్తం తాగే బ్రోకరన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్.  చీఫ్ మినిస్టర్ లా కాకుండా చీఫ్ బ్రోకర్ లా వ్యవరిస్థున్నాడని అన్నారు. హరీష్, కవిత సంపాదించింది కార్పొరేట్ కాలేజీల్లో పెడుతున్నారన్నారు. రైతులను సన్నాలు వేయమని చెప్పి మద్ధతు ధర ఇవ్వటం లేదన్నారు. ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్… ఇప్పుడు ధర్నా చేస్తాడా అని ప్రశ్నించారు. రైతుల గురించి కేసీఆర్ మాట్లాడడం ఈ దశాబ్ధపు జోక్ అన్నారు అర్వింద్.

బురుద గుంటలో బొర్లే పందులు కేసిఆర్ కేటీఆర్, హరీష్ లు అని అన్నారు. రైతు చట్టంపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చకు సిద్దమన్నారు. మొగ పుట్టుక పుట్టినోడు ఎవడైన కొత్త వ్యవసాయ చట్టాలపై బహిరంగ చర్చకు రావాలన్నారు. చర్చలో కూడా తాను ఒక్కడినే ఉంటానన్నారు. ఎలా నష్టం జరుగుతుందో చెప్పాలన్నారు. ఈ చట్టంతో రైతులకు ఎలా లాభం జరుగుతుందో తాను చెప్తానన్నారు.

తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్ ను త్వరలో బట్టలూడదీసి కొడ్తారన్నారు. ఉద్యమం అంటే కేసీఆర్ కు చూపిస్తామన్నారు. గడాఫీకి పట్టిన గతే కేసీఆర్ కు పడ్తోందన్నారు. టీఆర్ఎస్  తెలంగాణలో ఫేక్ ఉద్యమం నడుపుతోందన్నారు.  గ్రేటర్ ఎన్నికల్లో దిమ్మతిరిగింది… కేటీఆర్ కు సరిపోలేదేమో? అని అన్నారు. మక్క కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు?.  సన్నాలను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. దగ్గు, జలుబు వస్తే కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రైన యశోదాకే ఎందుకు వెళ్తున్నాడన్నారు.

కేటీఆర్, కవితలు కమిషన్ ఇవ్వకపోవటం వలనే ఎమ్మెల్యే, మంత్రులు కబ్జాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ రైతు నిర్వచనాన్నే మార్చివేశారన్నారు. దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని.‌‌‌‌. పాస్ పుస్తకం ఉన్నోడిదే భూమి అనే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చాడన్నారు. దళారీలు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు .‌‌. ఢిల్లీ ఉద్యమంలో రైతులెవరూ లేరన్నారు. తెలంగాణలో పండుతోన్న పసుపును కాదని.‌. కమిషన్ కోసమే ప్రభుత్వం పసుపును దిగుమతి చేసుకుంటోందన్నారు. వేల కోట్ల రూపాయల కమీషన్లు పోతున్నాయనే రైతు చట్టాలపై ప్రాంతీయ పార్టీల ఏడుస్తున్నాయన్నారు.

శేరిలింగంపల్లి భారత్ బంద్ లో ఉద్రిక్తత : వ్యక్తిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే