ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణించినట్లు దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో కూడా దీనిపై న్యూస్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారం అని ఆయన కుమార్తె నటి ఇషా డియోల్ స్పందించారు. తన తండ్రి బ్రతికే ఉన్నాడంటూ ఆమె తన అధికారిక ఇన్ స్ట్రా పేజీలో పోస్టు పెట్టారు. ఫ్యాన్స్ ఆందోళనలకు చెక్ పెడుతూ ఆమె ప్రస్తుతం ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని, క్షేమంగా ఉన్నారని అందులో వెల్లడించారు.
తన తండ్రి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భావిస్తున్నట్లు ఈషా చెప్పారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. గడచిన కొన్ని రోజులుగా ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో, కొన్ని వార్తా కథనాల్లో ఆయన మృతిపై వచ్చిన తప్పుడు వార్తలు ఫ్యాన్ ని ఆందోళనకు ఈషా ఇచ్చిన క్లారిటీ ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ హీ-మ్యాన్ గా పిలువబడే ధర్మేంద్ర ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.
