మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించే దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన… బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. ఆర్థిక రంగానికి చేయుతనిచ్చే చర్యలపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభావం చూపించిందని అన్నారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ స్పీడ్ గా జరుగుతుందని తెలిపారు.
కేంద్రం కో-ఆపరేటివ్ ఫెడరలిజంకి ప్రాధాన్యత ఇస్తుందని అందుకు కేసీఆర్ సహకరించడం లేదని తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణలో ప్రధాన మంత్రి అవాస్ యోజన అమలు కావడం లేదని అన్నారు. పసల్ భీమా యోజన, ఆయుష్మాన్ యోజన కావాలనే అమలు చేయడం లేదని చెప్పారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ( EWS) రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది అన్నారు.
