మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థుల ధర్నా

మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థుల ధర్నా

పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. మంథని -కాటారం ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. గురుకుల హాస్టల్ లో సరైన వసతులు లేక, విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పటికీ సిలబస్  పూర్తి కాకపోవడంతో ఆందోళన చేపట్టారు విద్యార్థులు.

మంథని -కాటారం ప్రధాన రహదారి వరకు దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి.. రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్ ను ఇక్కడి నుంచి వేరొక చోటికి మార్చాలని, తమకు సరైన వసతులు కల్పించాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని అన్నారు విద్యార్థులు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వారికి సద్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.