విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

 విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: పెండింగ్ లో ఉన్న  రూ.5300 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్​బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్  మల్యాల  రాకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. తెలంగాణ ఏర్పడి 9 ఏండ్లు పూర్తయినా విద్యారంగాన్ని బాగు చేయలేదని ఆరోపించారు. స్కూల్​స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న 15వేల టీచర్​పోస్టులను భర్తీచేయాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ లీడర్లు విష్ణు, నందు, వేణు, నితీశ్‌‌, శ్రీవర్ధన్ పాల్గొన్నారు.

జగిత్యాలలో.. 

జగిత్యాల టౌన్ : విద్యారంగంలో సమస్యలపై జగిత్యాలలో కలెక్టరేట్​ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాపాక సాయికుమార్ మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్‌‌మెంట్​ఫండ్స్ రిలీజ్​ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా విస్తరక్ నవీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్, సునీల్, రాజు, నందు, శ్రీనివాస్ పాల్గొన్నారు.