కాలా చష్మా సాంగ్ కు టీమిండియా స్టెప్పులు

కాలా చష్మా సాంగ్ కు టీమిండియా స్టెప్పులు

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో టీం ఇండియా జోష్ మామూలుగా లేదు. గ్రాండ్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. డ్రెస్సింగ్ రూలో   హిందీ మూవీ బార్ బార్ దేఖో మూవీలోని  కాలా చష్మా సాంగ్ కు అందరు కలిసి స్టెప్పులేశారు. శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్,  కేఎల్ రాహుల్ ఊర మాస్ స్టెప్పులతో ఎంజాయ్ చేశారు.  ఈ వీడియోను శిఖర్ ధావన్ తన ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశాడు.

జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది.శుభ్ మన్ గిల్ లాస్ట్ వన్డేలో అదరగొట్టారు. తన కెరీర్లో తొమ్మిదో వన్డేలో  ఫస్ట్ సెంచరీ చేశాడు. 82 బంతుల్లో సెంచరీ చేశాడు.97 బంతుల్లో 130 పరుగులు చేశాడు.