విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండుకి తీవ్రగాయాలు

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండుకి తీవ్రగాయాలు

ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఆగివున్న రెండు కార్లను వేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టడంతో డాన్స్  మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగం , నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపిలోని విశాఖ జిల్లా లొడగలవాని పాలెం హైవైపై  బుధవారం తెల్లవారు జామున(జూన్ 3) ఈ ప్రమాదం జరిగింది. 

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియాలిటీ షో ఢీ జోడి ఫేం.. డాన్స్ మాస్టర్ పండు  ఏపీలోని తగరవలసలో పదహారేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఊరిపండుగ ఉత్సవాలకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో లొడగలవాని పాలెం సమీపంలో హైవేపై ఆపి వున్న మూడు కార్లను ఆపారు. పండు మాస్టర్ కారు దిగి రోడ్డు పక్కన నిల్చున్నారు. అదే సమయంలో  వేగంగా వచ్చిన కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం పండు మాస్టర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

బొలెరో వేగానికి పండు మాస్టర్ కారుతో పాటు మరో వాహనం కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్‌ను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.