
స్వరాజ్ ట్రాక్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ ఎంఎస్ ధోని నియమితుల య్యారు. ఇక నుంచి కంపెనీ బ్రాండ్‌ను ఆయన ఎండోర్స్ చేస్తారు. ఎంఎస్ ధోని కూడా తమ కస్టమర్ అని స్వరాజ్ ట్రాక్టర్స్ చెప్పుకుంటోంది. ధోనికి వ్యవసాయంపై మంచి అవగాహన ఉందని, దీంతో స్వరాజ్ బ్రాండ్‌కు ఆయనే పర్‌ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అని వెల్లడించింది. కరోనా సంక్షోభ టైమ్‌లోనూ వ్యవసాయానికి టైమ్ కేటాయించానని ధోని పేర్కొన్నారు.