ఆటోగ్రాఫ్ పేరుతో నా చాక్లెట్లు కొట్టేస్తావా.. ఇటివ్వు!  అభిమానితో ధోని

ఆటోగ్రాఫ్ పేరుతో నా చాక్లెట్లు కొట్టేస్తావా.. ఇటివ్వు!  అభిమానితో ధోని

సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెబితే ఫాలోయింగ్ తగ్గడం కామన్. కానీ టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని మాత్రం దీనికి భిన్నం. అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినా మహీ క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవలే యూఎస్ ఓపెన్ చూడడానికి వెళ్లిన మహేంద్రుడు అక్కడ ఏకంగా డోనాల్డ్ ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఒక ఫ్యాన్ విషయంలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. 

నా చాకోలెట్ నాకిచ్చేయి

 ప్రస్తుతం ధోని USAలో తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ఫ్యాన్ ఒక మహీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఇచ్చాడు. అయితే అప్పటికే ధోనీ చేతిలో చాకోలెట్ లు ఉండడంతో అవి అభిమాని దగ్గర ఉంచి అతని చేతిలో ఉన్న పెన్ తీసుకొని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీని తర్వాత ధోనీ ప్రవర్తన చిన్న పిల్లాడిలా అనిపించింది. నా చాకోలెట్ లు నాకివ్వు అని అడిగి తీసుకున్నాడు. మాహీ చేసిన ఈ  పని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొత్తానికి మహేంద్రుడు ఏది చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుందని మరోసారి నిరూపించాడు.