ఫ్యాన్ టీ షర్ట్పై ధోని ఆటోగ్రాఫ్

ఫ్యాన్ టీ షర్ట్పై ధోని ఆటోగ్రాఫ్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉండే క్రేజే వేరు. భారత జట్టును విజయపథంలో నడిపిన ధోని అంటే ఫ్యాన్స్కు పిచ్చి ప్రేమ. అందుకే ఆయన కనిపిస్తే ఫ్యాన్స్ వదలరు. ఫొటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకునేందుకు పోటీ పడుతుంటారు. తాజాగా ఓ అభిమానికి ధోని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తన అభిమాని టీ షర్ట్‌ వెనకాల ఆటోగ్రాఫ్‌ చేశాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది.  

https://twitter.com/TheDhoniEmpire/status/1601962815753158658

ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా తప్పుకున్న తర్వాత జడేజాను టీమ్ మెనేజ్ మెంట్ సారథిని చేసింది. అయితే.. టీమ్ వైఫల్యాలతో మళ్లీ కెప్టెన్సీని ధోనికి అప్పగించింది. ఈ ఏడాది ధోని సారథ్యంలోనే ఐపీఎల్ 2023లో బరిలోకి దిగబోతుంది.