
రాంచీ: ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్ది.. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాడు. అయితే బ్యాట్‌తోనో, నెట్స్‌లో కాకుండా.. వెరైటీగా గుర్రంతో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇటీవలే తన ఫామ్‌హౌస్‌లోకి వచ్చిన షెట్లాండ్ పోనీ(గుర్రం)తో రన్నింగ్ రేస్ పెట్టుకున్నాడు. దీంతో మహీ క్రమంగా ట్రెయినింగ్ మోడ్‌లోకి వస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘స్ట్రాంగర్, ఫాస్టర్’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన సురేశ్ రైనా.. ఫైర్ఎమోజీని కామెంట్‌గా పెట్టాడు.