మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది: ధూం ధాం టీమ్

మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది: ధూం ధాం టీమ్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన  ‘ధూం ధాం’ చిత్రం  నవంబర్ 8న విడుదలైంది. సినిమాకి మంచి  రెస్పాన్స్ వస్తోందని తెలియజేస్తూ శనివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది టీమ్. 

చేతన్ కృష్ణ మాట్లాడుతూ ‘ప్రేక్షకుల నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా బాగుందంటే తప్ప ఆడియెన్స్ బయటకు రాని ఈ ట్రెండ్‌‌‌‌లో 70, 80 పర్సెంట్ హౌస్ ఫుల్స్ కావడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. ఇందులోని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ మెంట్‌‌‌‌కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారని హెబ్బా పటేల్ చెప్పింది. సినిమా రిలీజైన ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అదృష్టం అని దర్శక నిర్మాతలు అన్నారు. నటుడు గిరిధర్, రైటర్ గోపీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.