
ఈ ఏడాది ఏప్రిల్‌లో విక్రమ్ నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రం విడుదల కాగా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ‘తంగలాన్’ అనే పీరియాడిక్ మూవీ రానుంది. అయితే ఈలోపు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్రమ్. దాదాపు ఏడేళ్లుగా ఆగుతూ వస్తున్న ‘ధృవ నచ్చత్తిరం’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయింది. నవంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు శనివారం ప్రకటించారు.
గౌతమ్ మీనన్ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో విక్రమ్.. ఏజెంట్ ధృవ్, జాన్ అనే రెండు క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ఇంప్రెస్ చేస్తోంది. విక్రమ్‌కు జంటగా రీతూ వర్మ నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, రాధిక, సిమ్రాన్, వినాయకన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.