ముడి వజ్రాల దిగుమతి ఆపండి.. మెంబర్లను కోరిన డైమండ్​ ఇండస్ట్రీ అసోసియేషన్​

ముడి వజ్రాల దిగుమతి ఆపండి.. మెంబర్లను కోరిన డైమండ్​ ఇండస్ట్రీ అసోసియేషన్​
  • పాలిష్డ్​  డైమండ్స్​కు డిమాండ్​ లేకపోవడమే కారణం

న్యూఢిల్లీ: ముడి వజ్రాల దిగుమతిని అక్టోబర్​15 నుంచి రెండు నెలలపాటు ఆపాల్సిందిగా తన సభ్యులను జెమ్స్​అండ్​ జ్యుయెలరీ ఇండస్ట్రీ కోరింది. గ్లోబల్​గా డిమాండ్​ తగ్గడంతోపాటు, దేశంలోని ప్లేయర్ల వద్ద నిల్వలు ఎక్కువవుతుండటంతో ఈ పిలుపును ఇచ్చింది. లూజ్​ పాలిష్డ్​ డైమండ్స్​కు అమెరికా, చైనా వంటి దేశాలలో డిమాండ్​తగ్గుతోంది. గత కొన్ని క్వార్టర్లుగా ఈ డిమాండ్​ నిలకడగా పడిపోతోంది. 2021, 2022 సంవత్సరాలలో లూజ్​ పాలిష్డ్​  డైమండ్స్​కు డిమాండ్​ బాగా పెరిగింది. ఆ తర్వాత నుంచి ఆర్డర్లు క్రమంగా తగ్గాయి. ఈ కారణంగా మన దేశపు వజ్రాల ఎగుమతులు జనవరి–ఆగస్టు 2023 మధ్య కాలంలో 25 శాతం పడిపోయాయి. ఫలితంగా దేశంలోని డైమండ్​ ఇండస్ట్రీ వద్ద నిల్వలు పేరుకుపోయాయని, రేట్లు కూడా కొంత తక్కువ లెవెల్​లోనే ఉన్నాయని ఒక సర్క్యులర్​లో జెమ్స్​ అండ్​ జ్యుయెలరీ ఇండస్ట్రీ తెలిపింది. ఈ సర్క్యులర్​ను జెమ్​ జ్యుయెలరీ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​ (జీజేఈపీసీ), భారత్​ డైమండ్​ బౌర్స్​, సూరత్​ డైమండ్​ బౌర్స్​, ముంబై డైమండ్​ మర్చంట్స్​ అసోసియేషన్​, సూరత్​ డైమండ్​ అసోసియేషన్​లు కలిసి జారీ చేశాయి. ముడి వజ్రాలను మైనింగ్​ కంపెనీలు అమ్ముతూనే ఉన్నాయి.

పాలిష్డ్​  డైమండ్స్​కు డిమాండ్ ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా మైనింగ్​ కంపెనీలు తమ అమ్మకాలు సాగిస్తున్నాయని సర్క్యులర్​ వివరించింది. ఇండస్ట్రీలోని చిన్న, మధ్య తరహా సంస్థలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్​ పేర్కొంది. డిసెంబర్​ 2023 మొదటివారంలో మరోసారి పరిస్థితిని రివ్యూ చేసి, నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ముడి వజ్రాల దిగుమతిని వాలంటరీగానే నిలిపివేయమని మెంబర్లను పరిశ్రమ కోరుతోంది. అమెరికాతో పాటు, ఇతర దేశాలలో పాలిష్డ్​ డైమండ్స్​కు డిమాండ్​ పెంచేందుకు జీజేఈపీసీ అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వివరించింది. ఆల్టర్నేటివ్​ మార్కెట్ల కోసం వెతుకుతున్నట్లు కూడా జీజేఈపీసీ మాజీ చైర్మన్​ కోలిన్​ షా చెప్పారు. పరిశ్రమలోని చిన్న, మధ్య తరహా సంస్థల మనుగడ దృష్టిలో ఉంచుకుని గతంలోనూ ఇలాంటి వాలంటరీ బ్యాన్​లను అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.