
హైదరాబాద్, వెలుగు: సిటీలోని సోమాజీగూడ మలబార్ గోల్డ్, డైమండ్స్ ఆర్టిస్ట్రీ స్టోర్ వజ్రాభరణాల బ్రాండ్ డీ బీర్స్ అవంతి, ఐకాన్, సాలిటైర్ కలెక్షన్ను ప్రదర్శిస్తోంది. ఈ నెల మూడో తేదీ నుంచి 18 వరకు ఈ వజ్రాల నగలను, సాలిటైర్లను ప్రదర్శిస్తారు. డీ బీర్స్ వజ్రాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తుందని, ఇందుకు చాలా ప్రమాణాలను పాటిస్తుందని సంస్థ వైస్ ప్రెసిడెండ్ అమిత్ ప్రతిహారి అన్నారు. మలబార్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సిరాజ్ మాట్లాడుతూ డీ బీర్స్ సాలిటైర్లను ప్రదర్శించడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. డీ బీర్స్కు ఎంతో నాణ్యమైన, అరుదైన వజ్రాలను అందించగల సామర్థ్యం ఉందని వివరించారు. ఈ సందర్భంగా 500 రకాల నగలను ప్రదర్శిస్తామని ఆయన పేర్కొన్నారు.