12 వేల వజ్రాలతో రింగ్.. గిన్నీస్ రికార్డులో చోటు

12 వేల వజ్రాలతో రింగ్.. గిన్నీస్ రికార్డులో చోటు

మామూలుగా ఒక్క వజ్రం పొదిగిన ఉంగరానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అటువంటిది 12 వేల వజ్రాలు పొదిగిన ఉంగరమైతే.. దాని గురించి వేరే చెప్పక్కర్లేదు. గుజరాత్‌కు చెందిన 25 ఏళ్ల హర్షిత్ బన్సల్ 12, 638 వజ్రాలనుపయోగించి పువ్వు ఆకారంలో ఉన్న ఉంగరాన్ని తయారుచేశాడు. ఇది ఎనిమిది పొరలుగా తయారుచేయబడింది. ‘ది మేరిగోల్డ్ – ది రింగ్ ఆఫ్ ప్రోస్పెరిటీ’గా పిలువబడే ఈ రింగ్.. చేతి వేలుకు పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అయితే ఈ రింగ్ అమ్మడానికి చేయలేదని.. కేవలం తమ కంపెనీ గురించి తెలియచేయడానికే ఈ రింగ్‌ను తయారుచేసినట్లు బన్సల్ తెలిపాడు. సూరత్‌లో ఆభరణాల రూపకల్పన గురించి రెండేళ్ల క్రితం చదువుతున్నప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని బన్సల్ చెప్పారు.

‘నా లక్ష్యం 10,000 కంటే ఎక్కువ వజ్రాలతో రింగ్ తయారుచేయడం. నేను తయారుచేసిన ఈ రింగ్ యొక్క ఎనిమిది పొరలలో ప్రతి చిన్న పొర ప్రత్యేకమైనది. చాలామంది కొనుగోలుదారులు ఈ రింగ్ కావాలని అడిగారు. కానీ, నేను ఇది తయారుచేసి ఇవ్వనని చెప్పాను. ఇది మా కంపెనీకు గర్వకారణం మరియు అమూల్యమైనది’ అని బన్సల్ తెలిపాడు.

గతంలో ఈ రికార్డు 7,801 వజ్రాలతో తయారు చేసిన రింగ్ పేరిత ఉంది. అది కూడా ఇండియాలోనే తయారుచేయబడింది.

For More News..

మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్య

తల్లి ఓటమికి కారణమైన కొడుకు డమ్మీ నామినేషన్

జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లుగా నిలిచి గెలిచిన భార్యభర్తలు