
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మరోసారి పొలిటికల్ సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా విషయంలో కూడా ఏపీ పాలిటిక్స్ హీటెక్కిన విషయం తెలిసిందే. ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ నాయకులు ఆ సినిమాపై విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడిప్పుడే ఈ విషయం సద్దుమణుగుతుంది అనుకుంటున్న టైమ్ లో చిరు చేసిన ఈ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారాయి.
చిరు హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య 200 రోజులు ఇటీవలే కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ, నిర్మాతలు రవి, నవీన్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ సినిమా రంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అంటూ ఘాటుగానే స్పందించారు.
అయితే సీఎం జగన్ను టార్గెట్ చేసే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంత్రులు కూడా ప్రెస్ మీట్స్ పెట్టి బ్రో సినిమా కలెక్షన్స్ గురించి వివరించడం, బ్రో సినిమా ఫ్లాప్ అని చెప్పడం, సినిమాల వల్లే యువత పెడదారి పడుతందని కామెంట్స్ చేయడంతో.. ఖచ్చితంగా చిరు వైసీపీని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారన్న వాదనలు . వినిపిస్తున్నాయి. మరి చిరు చేసిన ఈ కామెంట్స్ పై ఏపీ రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి ఇక.
మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి
— ???????? ???? ??????? (@Gowtham__JSP) August 7, 2023
అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి - @KChiruTweets ?? pic.twitter.com/XjJOodQLbP