మమ్మల్ని రాక్షసుల్లా..నేరస్థుల్లాగా చూస్తున్నారు

మమ్మల్ని రాక్షసుల్లా..నేరస్థుల్లాగా చూస్తున్నారు

దేశవ్యాప్తంగా క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇన్వాల్వ్ కావడంతో మరింత సెన్సేషన్ అయింది. డ్రగ్స్ సరఫరా కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్యన్ ఖాన్.. కొన్ని వారాల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ క్రమంలో సిట్ ఎన్నో సార్లు ఆర్యన్ ను విచారించినప్పటికీ.. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మే 28న ఆర్యన్ ను విడుదల చేశారు. అయితే ఇంత జరిగినా ఆర్యన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్కసారి కూడా పెదవి విప్పలేదు. 

అయితే తాజాగా ఈ కేసుపై ఆర్యన్ ఖాన్ మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ తో చేసిన ఓ ఇంటర్వ్యూలో ఆర్యన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "సర్, నా మీద ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్ అనే ముద్ర వేశారు. వారికి ఆర్థిక సాయం చేస్తున్నానని ఆరోపణలు చేశారు. ఇవన్నీ వెగటుగా అనిపించట్లేదా ? ఆ రోజు నా దగ్గర ఎలా డ్రగ్స్ దొరకకపోయినా నన్ను అరెస్ట్ చేశారు. తప్పు చేయకపోయినా తప్పు చేశానన్నారు. నా పేరు, ప్రతిష్ఠల్ని నాశనం చేశారు. ఏ తప్పూ చేయకపోయినా... అన్ని వారాలు నేను జైలులో ఎందుకుండాలి ? నిజంగా నాకు ఆ శిక్ష సబబేనా ?" అని ఆర్యన్ ఖాన్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 

అయితే ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే షారుఖ్ ఖాన్ కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యాడని.. ఆర్యన్ ఖాన్ ఆరోగ్యంపై చాలా బెంగ పెట్టుకున్నాడని సంజయ్ సింగ్ చెప్పారు. జైలులో ఆర్యన్ ఖాన్ బెడ్ వరకూ వెళ్లి.. రాత్రంతా తోడుగా ఉండేవారన్న ఆయన.. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. తన కొడుకును జైలులో పెట్టారంటూ వాపోయారు. అందరూ తమను రాక్షసుల్లా.. నేరస్థుల్లాగా చూశారంటూ షారుఖ్ ఖాన్ ఆవేదన చెందే వారని సంజయ్ సింగ్ తెలిపారు.