ఇండియాలో అతిపెద్ద నది, ఉత్తర భారతావనికి జీవనదిగా పిలుచుకునే గంగానది.. భారతీయులకు అత్యంత పవిత్రమైన, ఆరాధ్యమైన నది. ఈ నదిలో నీరును కొందరు భక్తులు తీర్థజలంగా భావించి నిలవ ఉంచుకుని ఉపయోగిస్తుంటారు. గంగా జలం అంటే అంత పవిత్రంగా భావిస్తుంటారు భారతీయులు. కానీ ఆ నీళ్ల గురించి బ్రిటిష్ శాస్త్రవేత్త చేసిన పరిశోదనల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేయకమానదు. పవిత్ర గంగా జలంగా భావించే నీరు.. విషం అని నేరుగా పరిశోధనల ద్వారా చెప్పారు.
బ్రిటిష్ బయాలజిస్ట్ చేసిన పరిశోధనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రివర్ మాన్స్టర్ అనే షో నిర్వహించే జెరెమీ వేడ్.. గంగా నదికి స్వయంగా వెళ్లి చేసిన టెస్ట్.. గంగా నదిలో ప్రవహిస్తున్న విషం గురించి తెలియజేస్తుంది. నీళ్ల స్వచ్ఛతను పరీక్షించే చిన్న పరిశోధన ద్వారా నీళ్లు ఎంత డేంజర్ గా మారాయో వివరించారు. కెమికల్ టెస్టు ద్వారా చేసిన ప్రయోగంలో.. నీళ్లు గులాబీ రంగులోకి (పింక్) మారితే పరిశుభ్రమైనవిగా.. వేరే రంగులోకి మారితే విషపూరితమైనవిగా పరిశోధనల ద్వారా చెప్తుంటారు.
జెరెమీ వేడ్ ఇదే పరిశోధన చేశారు. గంగా జలం పరీక్షించే ముందు మినరల్ వాటర్ టెస్టు చేసి చూపించారు. మినరల్ వాటర్ డార్క్ పింక్–బ్రౌన్ కలర్ లోకి మారిపోయింది. శుద్ధమైన నీరు ఇలా మారుతుందని చెప్పారు. ఆ తర్వాత గంగా జలం పరీక్షించగా.. నీటి శాంపులు లైట్ బ్రౌన్ కలర్ లోకి మారిపోయింది. దీని అర్తం నీటిలో కోలిపామ్ బ్యాక్టీరియా ఉందని చెప్పారు. ఇక్కడ నీరు అంతా మానవ వ్యర్ధాలతో కలుషితం అయి ఉందని పరీక్ష ద్వారా వెల్లడించారు.
గంగా నది పవిత్రంగా లేదని చెప్పడం చాలా మంది హిందువులు జీర్ణించుకోలేని విషయంగా చెప్పుకొచ్చారు. గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించాల్సిందిగా ఒక సాధువు ఆహ్వానం మేరకు వెళిన వేడ్.. ఆ నదీ జలం శుద్ధంగా లేదని ఆ సాధువుతో దాదాపు యుద్ధమే చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. ఎంత విషపూరితంగా ఆ నీరు ఉందే రుజువు చేశాక ఆ సాధువు సందిగ్ధంలో పడిపోయారని అన్నారు.
సోషల్ మీడియాలో డిబేట్:
వేడ్ పరీక్షపై సోషల్ మీడియాలో చిన్నపాటి డిబేటే నడిచిందని చెప్పవచ్చు. మత విశ్వాసాలు గంగా నదిని చంపేస్తున్నాయి.. జ్ఞానం లేని చదువు మూఢత్వానికి ప్రతిరూపం అంటూ కామెంట్స్ చేశారు కొందరు.
క్లీనింగ్ గంగా పేరున ఎంతో మంది కట్టే పనులు వృధా అవటం దారుణం అంటూ కొందరు విమర్శించారు. గంగా ప్రక్షాళన పేరున పెడుతున్న ఖర్చు ఎటు పోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. నదిని శుభ్రంగా ఉంచడం కంటే నమ్మకాల పేరుతో కలుషితం చేయడంలోనే భక్తులు, ప్రజలు మునిగిపోయారని కొందరు కామెంట్ చేశారు.
