టీమిండియాలో కెప్టెన్సీ రాజకీయం?.. రిషభ్ పంత్ సిస్టర్ వైరల్ పోస్ట్‌తో మొదలైన రచ్చ!

టీమిండియాలో కెప్టెన్సీ రాజకీయం?.. రిషభ్ పంత్ సిస్టర్ వైరల్ పోస్ట్‌తో మొదలైన రచ్చ!

భారత క్రికెట్‌లో తీవ్రమైన చర్చ ఇప్పుడు మైదానం నుంచి సోషల్ మీడియాలోకి షిఫ్ట్ అయింది. జింబాబ్వే, సౌతాఫ్రికా సిరీస్‌ల తర్వాత.. BCCI తాజాగా ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కి టీమిండియా స్క్వాడ్ ఇంటర్నెట్‌లో కొత్త కాంట్రవర్సీకి తెరలేపింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మార్పులు, ముఖ్యంగా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను టెస్ట్ వైస్-కెప్టెన్సీ నుంచి పూర్తిగా తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

పంత్ సోదరి లైక్ చేసిన 'ఆ' వీడియో: 
రిషభ్ పంత్ సోదరి చేసిన ఒక డిజిటల్ మూవ్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మధ్య జరుగుతున్న అంతర్గత "రాజకీయాల" గురించి ఒక క్రియేటర్ చేసిన వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ఆమె లైక్ చేసింది. అంతే.. గిల్‌ను అన్ని ఫార్మాట్లలో తిరుగులేని ఏకైక లీడర్‌గా నిలబెట్టేందుకు, పంత్‌ను కావాలనే పక్కన పెడుతున్నారనే ఊహాగానాలు, కన్సిపిరసీ థియరీలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో శ్రేయస్ అయ్యర్ సోదరి విషయంలో కూడా ఇలాంటి సోషల్ మీడియా కాంట్రవర్సీయే జరిగి తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలిసిందే. 

►ALSO READ | కష్టాల్లో ముంబై.. కేవలం 41 రన్స్ కే 4 వికెట్లు డౌన్

వైస్ కెప్టెన్సీ పోయింది: 
ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. పంత్‌ను కేవలం స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా మాత్రమే సెలెక్ట్ చేశారు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను వైస్-కెప్టెన్ గా నియమించారు. అంతేకాదు, వన్డే జట్టు నుంచి పంత్‌ను పూర్తిగా తొలగించడంతో ఫ్యాన్స్ ని షాక్‌కు గురిచేసింది. అభిమానులు దీనిని కావాలనే చేసిన 'సైడ్‌లైనింగ్' అని విమర్శిస్తున్నప్పటికీ, క్రికెట్ విశ్లేషకులు మాత్రం మేనేజ్‌మెంట్ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.