రూ.100 దాటిన డీజిల్ ధర

రూ.100 దాటిన డీజిల్ ధర

న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం కూడా ధరల పెంపును కొనసాగించాయి.  పెట్రోల్ ధరను లీటరుకు 27 పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి.  
దీంతో రాజస్థాన్‌‌‌‌లో డీజిల్ ధర రూ .100 మార్కు దాటింది. కర్ణాటకలో పెట్రోల్ ధర రూ.100 దగ్గరకు చేరింది. దేశంలో ఏడు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. ఢిల్లీలో పెట్రోల్ ఆల్ టైం గరిష్ట స్థాయి రేటు లీటరుకు రూ.96.12లను తాకింది. డీజిల్ ధర లీటరుకు రూ. 86.98 గా ఉంది. వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులను బట్టి ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికీ మారుతూ ఉంటాయి. బెంగళూరులో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.39 లకు, లీటరు డీజిల్ రూ .92.27లకు పెరిగింది.  రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ లీటరుకురూ.107.22  వద్ద అమ్ముడవుతోంది. -ఇది దేశంలోనే అత్యధిక రేటు. డీజిల్ రేటు రూ.100.05 లకు చేరింది.   హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.99.96 కు, డీజిల్ ధర రూ. 94.82 కు చేరింది. గత నెల నుంచి పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.72 , డీజిల్ లీటరుకు రూ. 6.25  పెరిగింది.