ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ రైలును ప్రారంభించిన మోడీ

ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ రైలును ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ( మంగళవారం) వారణాసిలో డీజిల్‌ ఇంజిన్‌ నుండి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చిన మొట్టమొదటి రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అయితే డీజిల్‌ ఇంజిన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చడం భారత్‌లో ఇదే తొలిసారి. బ్రాడ్‌ గేజ్‌ విభాగంలోని రైళ్లన్నింటినీ ఎలక్ట్రిక్‌గా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. రైలు ప్రారంభించిన తర్వాత మోడీ ఆ రైలును  పరిశీలించారు. ఆ తర్వాత ప్రధాని సంత్‌ రవిదాస్‌ ఆలయంలో జరిగే జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో చేపట్టనున్న అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.