నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక.. బుజ్జగించే పనిలో మంత్రి

నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక.. బుజ్జగించే పనిలో మంత్రి

నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ గండ్రత్‌ ఈశ్వర్‌పై పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు తమ అనుకూల కౌన్సిలర్లను విహారయాత్రలకు పంపేందుకు  చైర్మన్ ఈశ్వర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో మంత్రి ఇంద్రకరణ్ హుటాహుటిన నిర్మల్ వెళ్లారు. రేపు తన నివాసంలో కౌన్సిలర్లతో సమావేశం కానున్నారు.కాగా నిర్మల్ మున్సిపాలిటీ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను నిలిపివేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. అన్ని వర్గాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.