ప్రముఖుల ఆత్మకథలు సమాజానికి అవసరం

ప్రముఖుల ఆత్మకథలు సమాజానికి అవసరం

ముషీరాబాద్, వెలుగు: ప్రముఖుల ఆత్మకథలు సమాజానికి అవసరమని దిగంబర కవి, రచయిత నగ్నముని తెలిపారు. దిగంబర కవుల్లో ఒకరైన కవి, రచయిత నిఖిలేశ్వర్ రాసిన ‘నిఖిల లోకం, సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం శివం రోడ్ లోని ఓ హోటల్​లో జరిగింది. ప్రముఖ కవి 
కె. శివారెడ్డి, నగ్నముని చీఫ్ గెస్టులుగా హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా నగ్నముని మాట్లాడుతూ.. సాహితీవేత్తలు, కవులు, ప్రముఖల ప్రయాణం ఉద్యమకారులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. నిఖిలేశ్వర్ సాహిత్యం విస్తృతం, విశాలమైందని ఆయన చెప్పారు. పుస్తక రచయిత నిఖిలేశ్వర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామంలో పుట్టిన తనను ఉద్యమాలే అక్కున చేర్చుకున్నాయన్నారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, సాహితీ వేత్త నందిని సిధారెడ్డి, బీఎస్ రాములు, సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్, తెలకపల్లి రవి, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, జయధీర్ తిరుమల్ రావు, అందెశ్రీ, కవులు, రచయితలు పాల్గొన్నారు.