విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి : వేం నరేందర్ రెడ్డి

విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి  : వేం నరేందర్ రెడ్డి
  • ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి

సుల్తానాబాద్, వెలుగు: విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన విశ్వబ్రాహ్మణులు గురువారం ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి హైదరాబాద్ లో నరేందర్ రెడ్డిని కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 

బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల స్వర్ణకారులకు పని లేకుండా పోతుందని, కార్పొరేట్ వ్యవస్థ, అక్రమ రికవరీలతో నష్టపోతున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సంఘ నాయకులు రాఘవచారి, హనుమాండ్లు, పూర్ణాచారి, కందుకూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రావు, శ్రీనివాస్, రాజు, లక్ష్మణ్, నరసింహచారి, చంద్రమౌళి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.