సింగరేణి పరిరక్షణకు గోలేటి నుంచి సత్తుపల్లి వరకు యాత్ర

సింగరేణి పరిరక్షణకు గోలేటి నుంచి సత్తుపల్లి వరకు యాత్ర

గోదావరిఖని, వెలుగు: సింగరేణి పరిరక్షణకు ఆసిఫాబాద్ జిల్లా గోలేటి నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వరకు కార్మిక యాత్ర నిర్వహించినట్లు టీబీజీకేఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన టీబీజీకేఎస్ కోర్ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమం, సింగరేణి భవిష్యత్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్ ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించారు. 

ఈక్రమంలో కార్మికులను, కోల్ బెల్ట్ ప్రజలను చైతన్య పరచడానికి విస్తృతంగా కార్మిక వాడలు, గనుల పైకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొమురయ్య, అధికార ప్రతినిధి రవి, సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్ల లీడర్లు పాల్గొన్నారు.