యూపీఐ, ఆధార్తో ఎకానమీకి ఎంతో మేలు

యూపీఐ, ఆధార్తో ఎకానమీకి ఎంతో మేలు

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌ఫేస్ (యూపీఐ), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) 2030 నాటికి ఇండియా ఆర్థిక  వ్యవస్థ 8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో కీలకంగా పనిచేయనున్నాయి.  వీటి ద్వారా దేశం  ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించగలదని నాస్కామ్ బుధవారం విడుదల చేసిన రిపోర్ట్​ తెలిపింది.

డీపీఐలు భారతదేశ జనాభాలో 97 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి. మెచ్యూర్డ్ డీపీఐల వల్ల 31.8 బిలియన్ డాలర్ల సంపద సృష్టి సాధ్యమయింది. ఇది 2022లో భారతదేశ జీడీపీలో 0.9 శాతానికి సమానం. డైరెక్ట్​ బెనిఫిట్స్​ ట్రాన్స్​ఫర్​ విధానంలో లోపాల తొలగింపు ద్వారా ఆధార్ 15.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి.  గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి. లిటిల్‌‌తో కలిసి నాస్కామ్ చేసిన రిపోర్ట్​ ప్రకారం, యూపీఐ వల్ల నగదు లావాదేవీలు, పేపర్​ వాడకం  తగ్గాయి. కాలుష్యమూ తగ్గింది.