అధిష్టానం సూచనలు పాటిస్తా

అధిష్టానం సూచనలు పాటిస్తా

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం పై  ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పోటీలో తాను లేనని చెప్పారు.  జబల్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.  అయితే పార్టీలో అధిష్టానం తనకు ఇచ్చిన సూచనలను పాటిస్తానని స్పష్టం చేశారు. 

ఇక రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పోటీలో ఉన్నారు. దీంతో అధ్యక్ష  ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబరు 24 నుంచి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. అక్టోబరు 1న నామినేషన్ల పరిశీలన, 8 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ జరగనుండగా..19న ఫలితాలను ప్రకటించనున్నారు.

1998 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగుతుండడం ఇదే మొదటిసారి. 1998లో జరిగిన ఎన్నికల్లో సీతారాం కేసరి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2000 నుంచి సోనియా గాంధీ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. మధ్యలో రాహుల్ ఆ పదవిని చేపట్టినా..2019 ఎన్నికల తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.