డిసెంబర్‌‌కల్లా 216 కోట్ల డోసులు.. ఎలా సాధ్యం?

డిసెంబర్‌‌కల్లా 216 కోట్ల డోసులు.. ఎలా సాధ్యం?

హైదరాబాద్: వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. డిసెంబర్ ఆఖరు కల్లా 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అనడం మీద ఓవైసీ మండిపడ్డారు. ‘ఆగస్టు నుంచి డిసెంబర్ నెలల మధ్యలో 216 కోట్ల టీకా డోసులను తయారు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యాక్సిన్‌‌ల్లో 55 కోట్ల టీకాలు కోవ్యాక్సిన్‌‌వే. కానీ ప్రస్తుతం భారత్ బయోటెక్ రోజుకు 5 లక్షల టీకాలనే తయారు చేస్తోంది. టీకా ఉత్పత్తి వేగాన్ని పెంచి రోజుకు 37 లక్షల వ్యాక్సిన్‌లను భారత్ బయోటెక్ తయారు చేయాలి. మనల్ని మభ్యపెట్టడానికే ప్రభుత్వం ఇలా చెబుతోంది.. తప్పితే మరొకటి కాదు’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.