పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

పొలిటికల్ ఎంట్రీపై సినీ నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలంటూ చాలా మంది ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. పలు పార్టీలు, పలువురు ప్రముఖులు పిలిచారని తెలిపారు. అయితే తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు. సినిమా ఫీల్డ్ లోనే తనను చాలా మంది విమర్శలు చేస్తే తట్టుకోలేకపోతున్నానని.. ఇక రాజకీయాల్లో విమర్శలు చేస్తే వాటిని తట్టుకోవడం తన వల్ల కాదన్నారు. అందుకే రాజకీయాల్లోకి రానని చెప్పారు.

బలగం ఇంత చరిత్ర సృష్టిస్తదని తను అనుకోలేదని దిల్ రాజు అన్నారు. బలగం లాంటి సినిమాలు తీయాలంటే మళ్లీ తీయలేమన్నారు. తనకు50 సినిమాలు నిర్మించిన అనుభవం ఉన్నా..  బలగం సినిమా  ఇంత అద్భుతమైన  సినిమా అవుతుందనుకోలేదని తెలిపారు. ప్రొడ్యూసర్ గా  ఈ జనరేషన్ లో మంచి సినిమాలు చేస్తున్నామని అన్నారు.  తనకు పేరొద్దని... కొత్త జనరేషన్  ను  ప్రోత్సహించడమే తన పనని చెప్పారు.

మరో వైపు పలు గ్రామాల్లో  తమ అనుమతి లేకుండా బలగం మూవీని చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేశారు దిల్ రాజు. పైరసీ యాక్ట్ కింద వెంటనే చర్చలు తీసుకోవాలని దిల్ రాజు ప్రొడక్షన్ టీమ్ కోరింది. ప్రస్తుతం ఈ పోలీస్ కంప్లైంట్ కు సంబంధించిన ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=1ouKR8URm90