సంక్రాంతికి చిన్న చిన్న ఇష్యూస్ కామనే: దిల్ రాజు

సంక్రాంతికి చిన్న చిన్న ఇష్యూస్ కామనే: దిల్ రాజు

మహేష్ బాబు(Mahesh Babu), శ్రీలీల(Sreeleela) జంటగా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో  ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం గుంటూరు కారం(Guntur kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12న  ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ సందర్భంగా సినిమాకొస్తున్న రెస్పాన్స్ గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘మేం ఊహించిన దాని కంటే గొప్ప రెస్పాన్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్  బాగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌తో ఉన్న రీజనల్ తెలుగు సినిమా వచ్చింది. ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు.

కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈవెనింగ్ షోస్ కంతా ఆ టాక్ అంతా సమసిపోయింది. చక్కగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే పండుగ సినిమా. పాటలు, ఫైట్స్, సెంటిమెంట్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఫెస్టివల్ మూవీ. అందరూ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌ అవుతారనే గ్యారంటీ మాది’ అన్నారు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ చిత్రం మొదటి  రోజు రూ.94 కోట్లు వసూళ్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తల్లీ, కొడుకు మధ్య ఉండే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ ఇది. కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు. ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో నిర్మాతల మధ్య చిన్న పాటి వార్స్ జరుగుతుంటాయి. ఇది వ్యాపారం. ఇక్కడ బిజినెస్ చాలెంజెస్ మాత్రమే ఉంటాయి. ఎవరికీ ఎవరూ శత్రువులు లేరు’ అని అన్నారు.