తేజస్విని అలా పరిచయమైంది : దిల్ రాజు

తేజస్విని అలా పరిచయమైంది : దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన రెండో పెళ్లి గురించి మొదటిసారి స్పందించారు. వైఘారెడ్డిగా పేరు మార్చుకున్న తన రెండవ భార్య తేజస్వినితో  పరిచయం, పెళ్లికి దారి తీసిన పరిస్థితుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  దిల్ రాజు వెల్లడించారు. తరుచుగా తాను విమాన ప్రయాణాలు చేసేవాడిని, అలా ఎయిర్హోస్టెస్ అయిన తేజస్వినితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఆ తర్వాత మాటలు కలిశాయని, సంవత్సరం పాటు గమనించిన తర్వాత పెళ్లి ప్రపోజల్ తెచ్చానని అన్నారు. పెళ్లికి ఓకే చెప్పిన తర్వాత తేజస్విని గురించి తన తల్లిదండ్రులు, కుమార్తెకు చెప్పానని దిల్ రాజు చెప్పారు. 

యూఎస్ఏ వెళ్లే విమానంలో దిల్ రాజు తరుచూ కనిపించేవారని అలా ఆయనతో పరిచయం ఏర్పడిందని తేజస్విని చెప్పింది. మొదటిసారి దిల్ రాజు తనను పెన్ను అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు మాట్లాడేవారని, ఒకసారి తన ఫోన్ నంబర్ తీసుకున్నారని చెప్పింది.  2020లో నిజామాబాద్ జిల్లాలోని ఓ దేవాలయంలో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరగగా వీరికి ఓ కుమారుడు ఉన్నారు.  ఇక ఇటీవల వారసుడు సినిమాతో దిల్ రాజు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.