భోగీలో డింపుల్ హయతి.. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ప్రీ లుక్ పోస్టర్

భోగీలో డింపుల్ హయతి..  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ప్రీ లుక్ పోస్టర్

శర్వానంద్ హీరోగా సంపత్ నంది రూపొందిస్తున్న పీరియాడికల్  చిత్రం  ‘భోగి’.  అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా అనుపమ పాత్రను ‘కందుల సులోచన రాణి’గా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేసింది.  తాజాగా డింపుల్ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఉంది. 

  హాఫ్ ఫేస్‌‌‌‌‌‌‌‌తో ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తూ ఆకట్టుకుంది.  సంప్రదాయ ఆభరణాలు, గంభీరమైన ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెషన్, బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో కనిపించే ఫైర్ ఎఫెక్ట్స్ ఆమె పాత్రపై  క్యూరియాసిటీ పెంచుతున్నాయి. డింపుల్  పాత్రకు సంబంధించిన పూర్తి ఫస్ట్ లుక్  గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను సోమవారం ఉదయం రివీల్ చేయనున్నట్టు ప్రకటించారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ-–మహారాష్ట్ర సరిహద్దుల్లో  సాగే ఈ కథ యాక్షన్, ఎమోషన్‌‌‌‌‌‌‌‌తో  నిండిన పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల  కానుంది.