V6 News

లండన్‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్‌‌‌ మెంటార్‌‎గా దినేశ్‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లండన్‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్‌‌‌ మెంటార్‌‎గా దినేశ్‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: టీమిండియా మాజీ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ది హండ్రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీ అయిన లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సేవలందించనున్నాడు. ఈ మేరకు కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం కుదిరిందని ఫ్రాంచైజీ బుధవారం ప్రకటించింది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న తొలి ఫ్రాంచైజీ ఇదే. రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరుతో సమానమైన పాత్రలోనే అతను పనిచేయనున్నాడు. ‘డీకేను లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘనంగా స్వాగతిస్తోంది. అతను నిజమైన ఆలోచనాపరుడు. షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా అనుభవం ఉంది. 

అది మాకు బాగా పనికొస్తుంది. కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. అతను చేసే ప్రతి పని కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది’ అని స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మో బోబాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. బోబాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. 2024 ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పిన కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇతర దేశాల లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కనిపిస్తున్నాడు. లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరడం చాలా ఉత్సాహాన్నిస్తోందని కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ఈ వేసవిలో లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మో బోబాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పాడు.