పేద క్రికెటర్ల కోసం సొంత డబ్బుతో స్టేడియం నిర్మించిన నటరాజన్ 

పేద క్రికెటర్ల కోసం సొంత డబ్బుతో స్టేడియం నిర్మించిన నటరాజన్ 

టీమిండియా యువ పేసర్, తమిళనాడు ఆటగాడు నటరాజన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తనలాంటి పేద క్రికెటర్ల కోసం స్టేడియాన్ని నిర్మించి ఉచితంగా కోచింగ్ అందిస్తానని చెప్పిన నటరాజన్.. అన్నంత పని చేశాడు. తమిళనాడు, సేలం జిల్లాలోని తన సొంతూరు చిన్నంపట్టిలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాడు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ స్టేడియాన్ని నిర్మించడం గమనార్హం.

ఈ స్టేడియాన్ని టీమిండియా వెటరన్ క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రారంభించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో పాటు ఆటగాళ్లు, పలువురు అభిమానులు హాజరయ్యారు. నటరాజన్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా నటరాజన్‌ చేసిన పనిని మొచ్చుకుంది.

జట్టుకు దూరమైనా.. మాట తప్పని నటరాజన్

ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో భారీ ధర పలికిన నటరాజన్.. తన లాంటి పేద ఆటగాళ్ల కోసం తన సొంత గ్రామంలో స్టేడియం నిర్మిస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం.. తన సొంతడబ్బులతో ల్యాండ్ కొనుగోలు చేసి స్టేడియాన్ని నిర్మించాడు. ప్రస్తుతం నటరాజన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.

T. Natarajan - ???????❤️?‍♂️#CricTracker #TNatarajan #TamilNadu pic.twitter.com/N1Ci5cv97I

— CricTracker (@Cricketracker) June 24, 2023