KL Rahul: కేఎల్ రాహుల్ స్థానంలో మరొక ఆటగాడిని ఆడించాలి: దినేష్ కార్తిక్

KL Rahul: కేఎల్ రాహుల్ స్థానంలో మరొక ఆటగాడిని ఆడించాలి: దినేష్ కార్తిక్

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫామ్ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా అన్ని ఫార్మట్లలో పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో జట్టులోనుంచి రాహుల్ ని తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతని ఫామ్ పై అభిమానుల, సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో దినేష్ కార్తిక్ రాహుల్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘రాహుల్ ని పక్కన పెట్టే టైం వచ్చింది. గత మ్యా్చుల ప్రదర్శన చాలా చెత్తగా ఉంది. ఇన్ని మ్యాచులు ఫేయిల్ అవుతున్నా ఛాన్స్ లు ఎందుకిస్తున్నారో అర్థం కావటంలేదు. రాహుల్ గొప్ప బ్యాటర్. కాదనను. కానీ, ప్రస్తుత పరిస్థితినిబట్టి ఫామ్ లో ఉన్న వాళ్లను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. కొంత టైం తీసుకొని మళ్లీ తిరిగి ఫ్రెష్ గా తిరిగి రావాల’ని కార్తిక్ అన్నాడు. 

కేఎల్ రాహుల్ గత 47 ఇన్నింగ్స్‌లో 26.15 సగటుతో 1203 పరుగుల మాత్రమే చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండగా.. ఐదు సార్లు డకౌటయ్యాడు. రాహుల్ టెస్ట్ కెరీర్‌లో 17 సార్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. 2022 జనవరి నుంచి టెస్టుల్లో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 25+ స్కోరు నమోదు చేయలేకపోయాడు.