వాతావరణాన్ని నాశనం చేయొద్దంటూ డైనోసార్ వార్నింగ్

వాతావరణాన్ని నాశనం చేయొద్దంటూ డైనోసార్ వార్నింగ్

ప్రపంచాన్ని ఉద్దేశించి డైనోసార్ మాట్లాడింది. అది కూడా ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో. ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ మాట్లాడడమేంటి అనుకుంటున్నారా..? వాతావరణ మార్పులు సృష్టించే ఉత్పాతాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం ఇది. వినాశనాన్ని ఎంచుకోవద్దూ అంటూ డైనోసార్ ద్వారా తెలియజెప్పింది UNDP. ఎల్లకాలం వాతావరణ సంక్షోభాన్ని విస్మరించలేమని, సాకులు చెప్పడం ఆపి వాతావరణ మార్పులపై పనిచేయడం మొదలు పెట్టాలని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. పరిస్థితులు పూర్తిగా చేజారకముందే వాతావరణ మార్పులపై చర్యలు ప్రారంభించాలని తేల్చి చెప్పింది.

For More News..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రికి ఫైనేసిన జీహెచ్ఎంసీ

వృద్ధులకు ఫ్రీ మీల్స్.. మిగతావారికి రూ. 5లకే ఫుల్ మీల్స్

కేసీఆర్‎కు బండి సంజయ్ డెడ్‎లైన్

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ