
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం..అలాగే విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
లేటెస్ట్గా..ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి డైరెక్టర్, యాక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన సినిమా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పారు. కీలక వ్యాఖ్యలు చేశారు. లియో మూవీ అత్యద్భుతంగా ఉండనుందని తెలిపారు.
లోకేష్ విభిన్నమైన స్టోరీతో తెరకెక్కిస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ఇది. డబ్బింగ్ సమయంలో నా సీన్స్ చూశా. ఒక్కో సీన్ దడ పుట్టించేసింది. దళపతి విజయ్‌తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి. ఆయన ఉదయం 9 గంటలకు షూట్ అంటే..7 గంటలకే సెట్‌లోకి వచ్చేసేవారు. డైలాగ్ పేపర్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తుంటే..వృత్తిపట్ల అంకితభావం, నిబద్ధత కలిగిన గొప్ప నటుడు విజయ్. అంతేకాకుండా లియో షూటింగ్ టైంలో మేము సరదాగా గడిపాం..అంటూ లియో విశేషాలు పంచుకున్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ మాట్లాడిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అలాగే..లియో మూవీలో తన క్యారెక్టర్ పేరు 'జె'తో స్టార్ట్ అవుతుందని..విజయ్ వెనుక ఉండే విలన్, స్నేహితుడు లాంటి మిక్స్ చేసిన క్యారెక్టర్ ను పోషిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో లియో మూవీలో తనకు సంబంధించిన పాత్ర ఎన్నో మలుపులు ఉంటుందని చెప్పకనే చెప్పారు.
Also Read :- సల్మాన్..ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఫిక్స్
రీసెంట్ గా లియో తమిళ రెండో సింగిల్(Badass)ని రిలీజ్ చేశారు మేకర్స్. అనిరుధ్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సాంగ్ ఆకట్టుకుంది. బాదాస్ మా..లియో దాస్ మా..అంటూ అనిరుధ్(Anirudh) తన వాయిస్ తో పిచ్చెక్కించేసాడు.
ఈ మూవీలో సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా..యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్ అనే కీ రోల్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన హెరాల్డ్ దాస్ గ్లింప్స్..తెరికే అంటూ సింగిల్ డైలాగ్ తో అర్జున్ బీభత్సం క్రియేట్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష(Trisha) నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో అక్టోబరు 19న రానున్న ఈ సినిమా..బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
LEO MONTH BEGINS#Leo @actorvijay
— Leo Rajesh 😍❤️❤️😻💙💙 (@RajaRajesh33393) October 1, 2023
Gvm sir about #Leo
Movie 🍿 pic.twitter.com/WKDJBHJ7UJ