వైవిధ్యభరితంగా మటన్‌‌ సూప్‌‌

వైవిధ్యభరితంగా మటన్‌‌ సూప్‌‌

రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలు. దసరా సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి టీజర్‌‌‌‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు. ప్రస్తుత ట్రెండ్‌‌కు తగ్గ కథ, కథనాలతో అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించాం. 

అక్టోబర్ 10న రాబోతోన్న మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.  టైటిల్‌‌ తరహాలోనే స్క్రీన్‌‌ ప్లే కొత్తగా ఉంటుందని, సినిమాకు మంచి రెస్పాన్స్‌‌ వస్తుందని ఆశిస్తున్నాం’ అని హీరో రమణ్, నటుడు జెమినీ సురేష్ చెప్పారు. నటుడు గోవింద్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.