
జాతి రత్నాలు(Jathirathnalu) సినిమాతో టాలీవడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అనుదీప్ కేవీ(Anudeep KV). నవీన్ పోలిశెట్టి(Naveen polishetty), ప్రియదర్శి(Priyadarshi), రాహుల్ రామకృష్ణ(Rahul ramakrishna) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాతో.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. దీంతో ఈ దర్శకుడి నుండి వస్తున్న సినిమాలపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.
ఇక తాజాగా అనుదీప్ నుండి వస్తున్న తరువాతి సినిమాల గురించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముందుగా వినిపిస్తున్న ప్రాజెక్టు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో. నిజానికి ఈ కాంబోకి సంబందించిన న్యూస్ జాతిరత్నాలు రిలీజ్ తరువాత నుండి వినిపిస్తున్నాయి. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు డిలే అయ్యింది. ఇక తాజాగా మరోసారి ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.
అంతేకాదు అనుదీప్ తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi)కి కూడా ఈమధ్య ఒక కథ వినిపంచారట. ఆ కథ కార్తీకి కూడా బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడని సమచారం. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha arts) లో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారట అనుదీప్. ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నారట.
ALSO READ :సినిమా, రాజకీయం ఏ ఒక్కరిదీ కాదు
అయితే.. ఈ మూడు ప్రాజెక్టు లలో మొదట ఏది పట్టాలెక్కనుంది అనేది ఇక క్లారిటీ రాలేదు. ఇక జాతిరత్నాలు తరువాత అనుదీప్ నుండి వచ్చిన ప్రిన్స్(Prince) మూవీ.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్(Shivakarthikeyan) హీరోగా వచ్చిన ఈ సినిమా.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నా అనుదీప్ ఇప్పటివరకు తన తరువాతి సినిమాను అనౌన్స్ చేయలేదు. అందుకే ఈ దర్శకుడి తరువాతి సినిమా ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది.