సినిమా, రాజకీయం ఏ ఒక్కరిదీ కాదు

సినిమా, రాజకీయం ఏ ఒక్కరిదీ కాదు

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు.  జులై 28న సినిమా విడుదల కానున్న సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నేను నటించే చిత్రాలు ఎంతోకొంత సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనుకుంటా. ఇది అలాంటి సంపూర్ణమైన చిత్రం. అందుకే నాకు స్పెషల్. తేజ్‌‌‌‌ నిజ జీవితంలో జరిగిన దానికి, ఈ సినిమాకి చాలా సంబంధం ఉంది. ఇందులో నాది గెస్ట్ క్యారెక్టర్ కాదు. ఎనభై శాతం కనిపిస్తా. ఇది నవ్విస్తుంది. కన్నీరు పెట్టిస్తుంది. ఇక సినిమా అంటే నాకు  ప్రేమ. కానీ సమాజం నాకు బాధ్యత. రాజకీయం అయినా  సినిమా పరిశ్రమ అయినా.. ఏ ఒక్కరికో చెందినది  కాదు. అందరిది. తెలుగు పరిశ్రమను రాజమౌళి లాంటి వారు హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. వచ్చే తరం దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా. నాకు హీరోలందరూ ఇష్టం. కానీ మిగతా హీరోలకంటే నేను పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటా. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. పోటీతత్వం లేకపోతే వెనకబడిపోతాం. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలి.

ALSO READ :Manipur Issue: మోదీ సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం

పోటీతత్వం, స్నేహభావం పోకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు.  ‘ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరవేసేలా ‘బ్రో’ ఉంటుంది’ అన్నాడు తేజ్. సినిమాలైనా, పాలిటిక్స్ అయినా మా కుటుంబమంతా బాబాయి  వెనుకే ఉంటుంది అని చెప్పాడు వరుణ్ తేజ్. సముద్రఖని మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ ఫ్యూచర్ గురించి భయపడుతున్నారు. కానీ లైఫ్‌‌‌‌లో ఫ్యూచర్ అనేది  లేదు.. అన్నీ ప్రెజెంట్ అని చెప్పే చిత్రమిది’ అన్నారు.  ఇందులో పవన్  కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారని నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల అన్నారు. బ్రహ్మానందం, వైష్ణవ్ తేజ్, హీరోయిన్స్ కేతిక శర్మ,  ప్రియా ప్రకాష్ వారియర్, ఊర్వశీ రౌతేలా, నటి రోహిణి, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ఏఎంరత్నం, నిమ్మకాయల ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.