కెప్టెన్ మిల్లర్​తో కనెక్ట్ అవుతారు : అరుణ్

కెప్టెన్ మిల్లర్​తో కనెక్ట్ అవుతారు : అరుణ్

ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. సంక్రాంతికి తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ పాజిటివ్ టాక్ వచ్చింది.  జనవరి 26న తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ ‘బ్రిటీష్ ఆర్మీలో పనిచేసిన భారతీయ సైనికుడిపై సినిమా తీయాలనే ఆలోచన నుంచి ఈ స్ర్కిప్ట్ రాశా.  

స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ని పూర్తి చేసిన తర్వాత, కెప్టెన్ మిల్లర్ పాత్రకు న్యాయం చేయడానికి ధనుష్ సరిగ్గా సరిపోతారని భావించి ఆయన్ను సంప్రదించాం. తనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పారు. అతను ఎలాంటి పాత్రనైనా చేయగలడు. ఇందులో తన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఈ జర్నీలో ధనుష్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. శివ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ గారి పాత్ర థ్రిల్లింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇస్తుంది.  ఆయన స్ర్కీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది.

అలాగే కెప్టెన్ రఫిక్ పాత్రలో సందీప్ కిషన్, వెల్మతి పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్ ఆకట్టుకుంటారు. 1930–40ల వాతావరణాన్ని రీ క్రియేట్ చేయడం చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించినా.. మా ఆర్ట్ డైరెక్టర్ రామలింగం దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.  ఇదొక ఎమోషనల్ స్టోరీ. నలభై శాతం మాత్రమే యాక్షన్ ఉంది. మిగతాదంతా క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌తో నడిచే కంప్లీట్ డ్రామా. ఇందులోని పాత్రలకు, కథకు ప్రేక్షకులు చాలా బాగా రిలేట్ అవుతారు. జీవీ ప్రకాష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఇవ్వడంలో మాస్టర్.  ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయడం హ్యాపీ. తెలుగు ప్రేక్షకులు కూడా కచ్చితంగా కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.