అది కెమెరాలో రికార్డ్ అయింది..అపుడు చిరంజీవి గారు తిడతారని భయమేసింది: బుచ్చిబాబు

అది కెమెరాలో రికార్డ్ అయింది..అపుడు చిరంజీవి గారు తిడతారని భయమేసింది: బుచ్చిబాబు

‘పెద్ది’లో చరణ్  పెర్ఫార్మెన్స్,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్  మైండ్‌‌‌‌‌‌‌‌బ్లోయింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు సానా అన్నాడు.  వెంకట సతీష్  కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదలవుతున్న  నేపథ్యంలో బుచ్చిబాబు ఇలా  ముచ్చటించాడు.

  •  ‘ఉప్పెన’ తర్వాత  దాదాపు 5 ఏళ్ల గ్యాప్‌‌తో ఈ సినిమా తీశా.  మా  గురువు సుకుమార్ చొరవతో రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ గారికి  కథ చెప్పాను. కథ వినగానే ఆయన నచ్చిందన్నారు.  స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ కావడంతో చరణ్  ప్రత్యేక  శిక్షణలు తీసుకున్నారు. క్రికెట్ అందరికీ తెలిసిన ఆటే. కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం.  ‘దంగల్’  చిత్రంలో అమీర్ ఖాన్‌‌‌‌‌‌‌‌కి  కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చాం.  అలాగే తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్‌‌‌‌‌‌‌‌లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్  ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహిల్వాన్ శిక్షణ తీసుకున్నారు. ఆయన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్, పెర్ఫార్మెన్స్    మైండ్‌‌‌‌‌‌‌‌ బ్లోయింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.   సినిమాలో కుస్తీ, క్రికెట్ రెండూ ఉన్నప్పటికీ భావోద్వేగాలే ప్రధాన బలం.  
  •  ఇది  విజయనగరం నేపథ్యంలోని 1985 కాలం ఫిక్షనల్ కథగా సాగుతుంది.   పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి చరణ్‌‌‌‌‌‌‌‌ దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ మైండ్‌‌‌‌‌‌‌‌బ్లోయింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. పుష్పరాజ్ మైండ్‌‌‌‌‌‌‌‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు.  ఇందులో  చరణ్ కనిపించడు.. పెద్ది మాత్రమే కనిపిస్తాడు. ఆట అతనికి ఏమిచ్చింది, అతను ఆట నుంచి ఏమి నేర్చుకున్నాడు అనేది ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అవుతుంది. 
  • ఈ సినిమాలో చరణ్‌‌‌‌‌‌‌‌కు చాలా గాయాలయ్యాయి.  ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది.  చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్‌‌‌‌‌‌‌‌లో పొరపాటున తగిలింది. 
  •  చరణ్ గురువు పాత్రలో  శివరాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ కనిపిస్తారు.  జగపతిబాబు పోషించిన అప్పలసూరి పాత్ర  హీరో తర్వాత అత్యంత శక్తివంతమైనది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.  జాన్వీ కపూర్ పాత్ర సినిమా లవ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  “అబ్బనీ తీయని దెబ్బ” పాటను రీక్రియేట్ చేయలేదు.  కేవలం రేడియోలో వినిపించేలా మాత్రమే ఉంచాం. మ్యూజిక్ డైరెక్టర్  ఏ.ఆర్. రెహమాన్‌‌‌‌‌‌‌‌ గారితో పనిచేయడం నా  కల నెరవేరినట్లుగా అనిపించింది. ఆయన ఇచ్చిన పాటలు ఇప్పటికే ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌లో నిలిచాయి. బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు అయితే సినిమాను మరింత ఎలివేట్ చేస్తుంది. 
  • ఫైనల్ కాపీ చూశాక మంచి సినిమా తీశాననే ఫీలింగ్ కలిగింది.  సుకుమార్ గారు పెద్ది చూసిన తర్వాత సెకండాఫ్ తన ఫేవరెట్ అని చెప్పారు. నిర్మాత  సతీష్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా ‘పెద్ది’ ఒక ఎమోషన్ జర్నీ. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.